హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ కేంద్రంలో అక్టోబర్ 31, నవంబర్ 1 తేదీల్లో యూఏఈ ప్రాపర్టీ గ్రాండ్ ఎక్స్‌పో జరగనుంది. దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్, అజ్మాన్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ మద్దతుతో గ్లోబల్ ఎడ్జ్ అడ్వర్టైజ్‌మెంట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పెట్టుబడిదారులకు దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో అవకాశాలపై అవగాహన కలిగిస్తారు. దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్‌లో భారతీయులు ఏటా 30 బిలియన్ దిర్హామ్‌లు (సుమారు రూ.77,736 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆస్తుల కొనుగోలు నిబంధనలు, అద్దె ఆదాయం, గోల్డెన్ వీసాగురించి ఎక్స్‌పో ద్వారా తెలుసుకోవచ్చు.
